Quick Enquiry | info@teluguwomenpoets.com

విశిష్ట మహిళలు

కుప్పమాంబ


తెలుగులో ప్రప్రధమ స్త్రీవాద కవయిత్రి (మౌఖికకవిత్వం)

తాళ్ళపాక తిమ్మక్క


ప్రధమాంధ్ర కవయిత్రి (లేఖకకవిత్వం)

భండారు అచ్చమాంబ


తొలి తెలుగు కథారచయిత్రి
వీరి కథ ధనత్రయోదశి 1902 నవంబరు హిందూసుందరి పత్రికలో ప్రచురితం

కొటికెలపూడి సీతమ్మ - కాలం - 19వ శతాబ్ది


తొలి తెలుగు మహిళా ఉపన్యాసకర్త్రి
వీరి ఉపన్యాసములన్నిటినీ ‘ఉపన్యాస మాలిక ‘ అనే పేరుతో ప్రచురించటమైంది.

మిసెస్ డ్రైడన్


తెలుగులో పత్రికా సంపాదకత్వం వహించిన ఆంగ్ల వనిత

మొసలికంటి రమాబాయమ్మ


పత్రికా సంపాదకత్వం వహించిన తొలి తెలుగు వనిత
ఈ పత్రిక ముద్రణ పనులను కూడా స్త్రీలే నిర్వహించటం విశేషం.

పోతం జానకమ్మ


తెలుగులో ప్రప్రధమ పత్రికా రచయిత్రి
తమ విదేశయాత్రను వివరిస్తూ వీరు రాసిన వ్యాసం 1874 సం. ఫిబ్రవరి నెలలో “శ్రీ మదాంధ్ర భాషాసంజీవని” పత్రికలో ప్రచురితమైంది.

శ్రీమతి వేలూరు శారదాంబ


ప్రధమ స్మృతి కవిత్వ రచయిత్రి
వీరేశలింగం గారి మృతి సందర్భంగా ఆగష్టు 1919 సం. అనసూయ పత్రికలో వీరు స్మృతి పద్యాలు రాశారు.

శ్రీమతి విక్రాల శ్రీదేవి


ప్రప్రధమ బంధకవిత్వ పద్య కవయిత్రి
వీరి వాసవదత్తా పరిణయముకావ్యంలో అశ్వాసాంతాలలో నాగ, పుష్పమాలిక, చక్ర, గోమూత్రికా, గుచ్ఛ, శర, ఖడ్గ, అష్టదళపద్మ, మర్దల, బంధ కవిత్వం లో పద్యాలను రాశారు.