Quick Enquiry | info@teluguwomenpoets.com

మలితరం కవయిత్రులు

కొటికెలపూడి సీతమ్మ - కాలం - 19వ శతాబ్ది


ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ వీరేశలింగం పంతులు గారి ఉత్తమ శిష్యురాలు.
భర్త కొటికెలపూడి రామారావు: తెనాలి తాలూకా జెవుడుపాడు నివాస గ్రామం.
సాధురక్షక శతకము: అహల్యాబాయి: పద్య భగవద్గీత: సతీధర్మములు: లేడీ జేన్ గ్రే ఒక మహ్మదీయ వనిత: వీరి ప్రసిద్ధ కావ్యములు. ఇంకా ఎన్నో కవితలు, పద్యాలు అప్పటి పత్రికలలో ప్రచురితాలు.
1913 బాపట్ల ప్రధమాంధ్ర సభకు అధ్యక్షత వహించిన మహిళ

భండారు అచ్చమాంబ - కాలం - 1874 - 1905


తెలుగులో మొట్టమొదటి కధారచయిత్రి గురజాడ కంటే ముందే తెలుగులో ఆధునిక కథ రాసిన విదుషీమణి.
వీరి మొట్టమొదటి కథ ‘ధన త్రయోదశి 1902 ప్రచురితం.
అబలా సచ్చరిత్రమాల మూడు భాగాలు సావిత్రి పత్రికలో 1905 సం. లో ప్రచురితం
విదేశీయుల చరిత్రలు
తండ్రి కొమఱ్ఱాజు వెంకటప్పయ్య పంతులు, భర్త భండారు మాధవరావు. విజ్ఞాన సర్వస్వ సంపుటాలకు ఆద్యుడైన కొమఱ్ఱాజు వెంకట లక్ష్మణ రావుసోదరి. నివాస గ్రామం కృష్ణా జిల్లా, నందిగామ.

రాణి చిన్నమాంబ - కాలం - 19/20 వ శతాబ్ది


రామాయణ సంగ్రహ వచనము
పిఠాపురం రాజా సూర్యారావు గారి సతీమణి.

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ -కాలం - 19/20 వ శతాబ్ది


ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ వీరేశలింగం పంతులు గారి ధర్మ పత్ని.
అనేక భక్తి గేయాలు, మంగళ హారతులు రాశారు.
వీరు హిందూసుందరి పత్రికను మెచ్చుకుంటూ 1904 ఏప్రియల్ లో గేయం రాశారు.

కిళాంబి త్రిపురసుందరమ్మ - కాలం 19/20 శతాబ్ది


కావ్యరాజము – హిందూసుందరి, 1913డిశంబరు సంచిక

బుర్రా సూరమాంబ -కాలం -19/20 వ శతాబ్దం


సావిత్రీ విజయము : నందనార, హరినాధ శతకాలు : ప్రహ్లాద నాటకము: శ్రీకృష్ణ బోధామృతము
తండ్రి సోమంచి భీమశంకరం : భర్త దేవేంద్ర నాధ్: విశాఖ మండలం శ్రీకాకుళం.

వేమూరి శారదాంబ - కాలం - జననం - తేది. 03-05-1881 : మరణం - 1899


నాగ్నజితీ పరిణయము : మాధవ శతకము
తండ్రి శ్రీరాములు : భర్త వేమూరి రామచంద్రుడు: నివాసం గుడివాడ తాలూకా విన్నకోట – అల్లూరు అగ్రహారం.
మంచి సామాజిక స్పృహ తో వీరు రాసిన కవిత్వం ‘తెలుగు జనానా’ పత్రికలో ముద్రితం.

మామిడన్న సుభద్రమ్మ - కాలం - 19/20వ శతాబ్దం


‘ఆధ్యాత్మ రామాయణం’ గ్రంధాన్ని ద్విపద లో రచించింది.
అయ్యగారి రామమూర్తి పంతులు సోదరి.

మొసలికంటి రామాయమ్మ - కాలం -19/20 వ శతాబ్దం


మీరాబాయి కావ్యకర్త్రి

చూడికుడుత్తమ్మాళ్ - కాలం - 19/20 వ శతాబ్దం


మృగశృంగ చరిత్ర కావ్య కర్త్రి.

మోదవరపు లక్ష్మీ నరసమాంబ - కాలం - 19/20వ శతాబ్దం


“భద్రాచలాధీశ్వర శతకము” కావ్యకర్త్రి

వెన్నెలకంటి హనుమాయమ్మ - కాలం- 19/20 వ శతాబ్దం


శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామివారి పాదుకా పూజనము
దత్తపూజాకదంబము: శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్య పూజావిధి
ఆధ్యాత్మ రామాయణము లోని శ్రీరామ లక్ష్మణ సంవాదము తెలుగు సేత.
ఈ గ్రంధాలన్నీ ప్రచురితాలే.
తండ్రి వెలగపూడి వెంకట్రామయ్య: భర్త వెన్నెలకంటి నటేశం: నివాసం-చెన్నూరు.

చోరగుడి సీతమ్మ - కాలం -19/20 వ శతాబ్దం


ప్రభావతీ ప్రద్యుమ్నం
తండ్రివెలగపూడి దక్షిణాయన మూర్తి: భర్త చోరగుడి వెంకటాద్రి

దరిశి అన్నపూర్ణమ్మ- జననం-1907, మరణం-1931


మహిళలకా ఉపయుక్తకరమైన అనేక సాహిత్య ప్రక్రియలను చేశారు.
ప్రముఖ సంఘసేవిక

సీరము సుభద్రయాంబ - కాలం - 19/20 వ శతాబ్దం


శ్రీవేంకటేశ్వర శతకం: శ్రీరామ శతకం ‘ ఉత్తరరామ చరిత్ర యను నిర్వచన కావ్యం” : సుభద్ర రామాయణం” ఉత్తరావిలాపము”: రుక్మిణీ సందేశము”: గృహలక్ష్మి”
ఈమె రచనలు 1925-35 లలో భారతి, గృహలక్ష్మి పత్రికలలో ప్రచురితాలు.
ఈమె శతగ్రంధకర్త అయిన శ్రీ సెట్టి లక్ష్మీ నరసింహకవి సోదరి.

జ్ఞానాంబ - కాలం - 19/20 వ శతాబ్దం


దేవుడు : విజ్ఞానామృతము : కాళీప్రసాదిని: రంగావధూత: గార్గి.
తండ్రి సుబ్బారాయుడు: నివాసము విజయవాడ

కర్రా సుబ్బలక్ష్మమ్మ - కాలం - 19/20 వ శతాబ్దం


చంద్రకళావిలాసం ప్రబంధము
భర్త కర్రా రామశర్మ : కడపమండలం శేషమాంబాపురం.

గ్రంధి మాణిక్యాంబ - కాలం - 19/20వ శతాబ్దం


గురుమౌళి శతకము
రాజమండ్రి గ్రామము: భర్త గ్రంధి నాగరాజు

కాళ్ళకూరి మహాలక్ష్మీ సుందరాంబ - కాలం - 19/20 వ శతాబ్దం


ప్రబోధ సుధాకరము: ఆంగ్లములో కవిత్వాన్ని రాసిన మొదటి తెలుగు మహిళ
తల్లి హిందూసుందరి పత్రికా స్థాపకురాలు బాలాంత్రపు శేషమ్మ కుమార్తె.
నివాసం మద్రాసు నగరం

వింజమూరి వెంకటరత్నమ్మ - 1889-1950


దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సోదరి: వింజమూరి లక్ష్మీ నరసింహం గారి ధర్మపత్ని
1914 నుండి 1920 వరకు అనసూయ పత్రికకు సారధ్యం వహించారు.
అప్పట్లో ముఖచిత్రం కలర్ ఫొటోలలో ముద్రించిన మొట్టమొదటి పత్రిక అనసూయ
విజ్ఞాన చంద్రికా గ్రంధ మండలి వారి బహుమతి విజేత.
పాకీవాడు – గృహలక్ష్మి, సెప్టెంబరు 1933 లో ప్రచురితం
ప్రేమ రాజ్యము – గృహలక్ష్మి, జనవరి 1932లో ప్రచురితం

ఆచంట సత్యవతమ్మ - 19/20 వ శతాబ్దం


గృహలక్ష్మి పత్రిక చిరకాల రచయితలో ఒకరు.: ప్రతి సంచికలో ఈమె రచనలు ఉండేవి.

పులుగుర్త లక్ష్మీ నరసమాంబ - కాలం - 19/20వ శతాబ్దం


సావిత్రి పత్రికా సంపాదకురాలు : సంఘసంస్కర్త శ్రీ వీరేశలింగం గారికి వ్యతిరేకి:
పులుగుర్త వెంకటరత్నం పంతులు వీరి భర్త. నివాసం కాకినాడ
స్త్రీ నీతి గీతములు: సతీధర్మములు: నీతి పదములు:మొ.
వీరి పద్యములు, కవితలు, రచనలు గృహలక్ష్మి,జనానా, హిందూసుందరి పత్రికలలో ప్రచురితాలు.

దొంతి రాజరత్నమ్మ - 19/20 వ శతాబ్ది


జనార్దన శతకము

వెలువోలు వసంతాదేవి - 19/20వ శతాబ్ది


రాట్నమా: గృహలక్ష్మి మే 1930సంచిక

బత్తుల కామాక్షమ్మ - జననం-1886: మరణం-16-12-1970


1929 సం.లో ఆంధ్రయూనివర్శిటీలో ద్వితీయ స్థానంలోఉభయభాషా ప్రవీణ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. ప్రముఖ కవయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మకు చదువు చెప్పించి ప్రోత్సహించారు.
గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీత

శ్రీమతి సరోజినీ నాయుడు - జననం- 13-2-1879, మరణం-2-3-1949


నేను ఆంధ్రమహిళను, నాది ఆంధ్రదేశం అని పేర్కొన్న తెలుగింటి కోడలమ్మ
అనేక ప్రసిద్ధ ఆంగ్లకవితలను రచించారు. ముత్యాలకోకిల వీరురాసిన ఆంగ్లకవితా సంపుటికితెలుగు అనువాదం.
1914 లో రాయల్ సొసైటీ ఆఫ్ ది లిటరేచర్ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ