Quick Enquiry | info@teluguwomenpoets.com

ప్రాచీనాంధ్ర కవయిత్రులు

కుప్పమాంబ- కాలం 1230-1240


ప్రాచీనాంధ్ర కవయిత్రులలో ప్రధమురాలు. : బుద్ధరాజు కుమార్తె: బాలవితంతువు.
తొట్టతొలుతగా స్త్రీవాద దృక్పథంతో కవిత్వం చెప్పిన వనిత
పావన వంశంబు స్వతంత్రమీయదు చెలీ!
వాంచల్ తుదల్ ముట్టునే!

చానమాంబ- కాలం - 13 వ శతాబ్ది


శ్రీమతి ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ గారు ఈమెను ప్రధమాంద్ర కవయిత్రి (మౌఖిక)గా పేర్కొన్నారు.
ఈమె ఖడ్గతిక్కనకు భార్య.

ప్రోలమ - కాలం - 13వ శతాబ్ది


కవిబ్రహ్మ తిక్కనకు, అన్నగారైన ఖడ్గతిక్కన మాతృమూర్తి

ఆతుకూరి మొల్ల - కాలం - 1320 - 1405


నెల్లూరు మండలం, గోపవరం నివాస గ్రామం, కుంభకార కుల సంజాత. తండ్రి కేసన.
మొల్ల రామాయణ కావ్య రచయిత్రి.
ప్రప్రధమంగా రాజసముఖంలో జాతి వివక్ష, కుల వివక్షేదుర్కొన్న మహా కవయిత్రి
పింగళి సూరన, వేమన, తెనాలి రామకృష్ణుడు వంటి లభ్ధప్రతిష్టులైన కవులు ఈమె ప్రయోగాలను తరువాత కాలంలో అనుసరించారు.

తిమ్మక్క - కాలం - 1424-1503


తాళ్లపాక అన్నమాచార్యుని పెద్దభార్య.
మంజరీ ద్విపద లో ‘సుభద్రా కళ్యాణం’ కావ్యాన్ని రచించింది
తెలుగులో తొలి కవయిత్రిగా వేటూరి ప్రభాకరశాస్త్రి గారి నిర్థారణ.

మోహనాంగి -కాలం -16వ శతాబ్ది


శ్రీకృష్ణదేవరాయల కుమార్తె.
మరీచీ పరిణయం కావ్య రచయిత్రి.

బాలపాపాంబ - కాలం -16 వ శతాబ్దం


శైవ సాహిత్య రచయిత్రి: వీర వసంత వసుమతీశుని పుత్రిక.
అక్కమహాదేవి చరిత్రను యక్షగాన రీతిలో రచించింది.

కృష్ణాజమ్మ - కాలం 17 వ శతాబ్దం


విజయరాఘవుని ఆస్థాన కవయిత్రి. రావినూతల తిరుమలయ్య కుమార్తె.
రచనలు అలభ్యాలు.

రంగాజమ్మ - కాలం -17వ శతాబ్దం


ఉషాపరిణయం, ప్రబంధం: మన్నారుదాసవిలాసం యక్షగాన ప్రబంధం.
విజయరాఘవుని ఆస్థాన కవయిత్రి. పసుపులేటి వెంకటాద్రి కుమార్తె.
తెలుగులో తొలి యక్షగాన కవయిత్రి.

ముద్దుపళని - కాలం-1740-1780


ప్రధమ శృంగార ప్రబంధ కర్తృణి. ఈమె తండ్రి ముత్యాలు.
రాధికా స్వాంతనము అను శృంగార ప్రబంధమును రచించింది.
ప్రతాపరుద్రుని ఉపపత్ని. తన కావ్యమున మితిమీరిన శృంగార వర్ణనలు చేసింది.

మదినె సుభద్రమ్మ - కాలం-17వ శతాబ్ది


రాఘవ రామ శతకము, కేశవరామ శతకము

బండి బాపమ్మ - కాలం - 17వ శతాబ్ది


మీనాక్షీ శతకం

రత్నాంబ - 17 వ శతాబ్ది


వేంకటరమణ శతకం

చెలికాని చెల్లాయమ్మ - 17వ శతాబ్ది


పార్థసారధి శతకం

దార్ల సుందరీమణి - కాలం 1833


భావలింగ శతకం రచయిత్రి: తండ్రి గంజి శ్రీరాములు: సాలె కులస్థురాలు.
నివాస గ్రామం – చర్లగుడిపాడు

తరి(కుండ)గొండ వేంకమాంబ - కాలం - 1840


తండ్రి కానలి కృష్ణార్యుడు: భర్త వేంకటాచలపతి: గురువు సుబ్రహ్మణ్య దేశికులు
నివాస గ్రామం -కడప జిల్లా, వాయల్పాడు మండలం, తరికుండ.
రాజయోగసారము: విష్ణుపారిజాతము యక్ష్సగానం: భాగవతము
పెక్కు యక్షగాన కావ్యములను రాసిన వారిలో ప్రధమురాలు.
బాల వితంతువు: సంఘ దురాచారాలకు ఎదురుతిరిగిన వనిత.